Vijayawada: విజయవాడకు చెందిన సైబర్ నేరగాడు శ్రవణ్‌కుమార్ అరెస్ట్

Vijayawada: హైదరాబాద్ సైబర్ క్రైమ్ బ్యూరో పెద్ద సైబర్ నేరాన్ని బట్టబయలు చేసింది. ఈ దర్యాప్తులో విజయవాడకు చెందిన శ్రవణ్‌కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతను కేవలం రెండు నెలల్లోనే రూ.500 కోట్లకు పైగా నగదు లావాదేవీలు జరిపినట్లు అధికారులు వెల్లడించారు.

సమాచారం ప్రకారం, శ్రవణ్‌కుమార్ 500కి పైగా మ్యూల్ అకౌంట్స్ ఉపయోగించి ఈ భారీ నగదు బదిలీలు చేశాడు. అంతేకాకుండా, దాదాపు 500 సైబర్ లింకుల ద్వారా డబ్బులు రాకపోకలు జరిగాయని దర్యాప్తులో బయటపడింది. ఈ అక్రమ లావాదేవీలు భారత్ అంతటా విస్తరించి ఉన్న నెట్‌వర్క్ ద్వారా జరిగాయని అధికారులు అనుమానిస్తున్నారు.

సైబర్ క్రైమ్ బ్యూరో ప్రస్తుతం ఈ కేసును మరింత లోతుగా పరిశీలిస్తోంది. అతనితో కలిసి పని చేసిన ఇతరులపై కూడా అన్వేషణ కొనసాగుతోంది. శ్రవణ్‌కుమార్ అరెస్ట్‌తో పెద్ద సైబర్ ఫ్రాడ్ గ్యాంగ్ బట్టబయలైనట్లు భావిస్తున్నారు.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Fake Clinics: పరిగిలో 6 ఫేక్‌ క్లినిక్‌లను సీజ్‌ చేసిన అధికారులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *