Vijayasaireddy: ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఆయన ఈ నెల 12వ తేదీ ఉదయం 11 గంటలకు విజయవాడ సీఐడీ కార్యాలయంలో హాజరుకావాలని ఆదేశించారు.
కేసుకు సంబంధించి ప్రస్తావించిన సెక్షన్లు:
సీఐడీ అధికారులు నోటీసుల్లో IPC 506, 384, 420, 109, 467, 120(B) రెడ్ విత్ 34 సెక్షన్లను ప్రస్తావించారు. ఈ సెక్షన్ల ప్రకారం, బెదిరింపు, మోసం, కుట్ర వంటి ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది.
సంస్థాగత కుట్రకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు విజయసాయిరెడ్డిని విచారించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, సీఐడీ ఆదేశాలను ఆయన ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.