Vijayasai Reddy: రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి శనివారం తన ఎంపీ పదవికి రాజీనామా పత్రాన్ని పార్లమెంట్‌లో అందజేశారు. ఈ మేరకు శనివారం ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీశ్ ధన్‌ఖడ్‌కు ఆయన తన రాజీనామా లేఖను అందజేశారు. స్పీకర్ ఫార్మాట్‌లో ఆయన ఈ లేఖను అందజేశారు.
Vijayasai Reddy: రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన మరునాడే ఎంపీ పదవికి రాజీనామా పత్రాన్ని అందజేయడం సంచలనంగా మారింది. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవడానికి పలు కారణాలను ఆయన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఇది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమని తెలిపారు తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని కూడా విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. వేరే పదవులు, ప్రయోజనాలు, సొమ్ములు ఆశించి రాజీనామా చేయడం లేదని తెలిపారు.
Vijayasai Reddy: అదే విధంగా తనపై ఎవరి ఒత్తిళ్లు లేవని, ఎవరూ ప్రభావితం చేయలేదని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటానని వ్యక్తం చేశారు. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి, తనను ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్లిన భారతమ్మకు కృతజ్ఞతతో ఉంటానని తెలిపారు.
Vijayasai Reddy: వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి మంచే జరగాలని తాను కోరుకుంటున్నట్టు విజయసాయిరెడ్డి తన ప్రకటనలో కోరుకున్నారు. పార్లమెంటరీ పార్టీ నేతగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్‌గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్రం కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశానని తెలిపారు.
Vijayasai Reddy: ఇదిలా ఉండగా, విజయసాయిరెడ్డిని మరో ఎంపీ అయిన గురుమూర్తి కలిసినట్టు చెప్పారు. వైసీపీలోనే కొనసాగాలని విజయసాయిరెడ్డిని తాను కోరినట్టు ఎంపీ గురుమూర్తి తెలిపారు. జగన్‌ను మళ్లీ గెలిపించడానికి కృషి చేయాలని కోరానని పేర్కొన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా తట్టుకునే ధైర్యం ఉన్న మీరు.. మీ అనుభవంతో పార్టీకి సేవలందించాలని అభ్యర్థించినట్టు గురుమూర్తి తెలిపారు.