Vijayanagaam: ఏపీలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో హోంగార్డుగా పనిచేస్తున్న శ్రీనివాసరావు ఇంట్లో సోదాలు నిర్వహించారు. అతని నివాసాలు విజయనగరం, గుర్ల, విశాఖ ప్రాంతాల్లో ఉండగా, అక్కడ తనిఖీలు చేసి దాదాపు రూ.20 కోట్ల మేర అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు.
ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, శ్రీనివాసరావు గతంలో 15 సంవత్సరాలు ఏసీబీలో పని చేశాడు. ఆ సమయంలో అధికారుల దాడుల గురించి ముందుగానే సమాచారాన్ని ఇచ్చి డబ్బులు తీసుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. అవినీతి ఆరోపణలు రావడంతో అతన్ని పోలీస్ కార్యాలయానికి బదిలీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనతో ప్రభుత్వ శాఖల్లో అవినీతి అంశం మళ్లీ చర్చకు వచ్చింది. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
