TVK Manifesto: తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు హీరో విజయ్ చుట్టూ తిరుగుతున్నాయి. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తన ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీని విజయ్ సిద్ధం చేస్తున్నారు. అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకే వంటి దిగ్గజ పార్టీలకు దీటుగా, ఈసారి ఎన్నికల బరిలో విజయ్ సరికొత్త ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.
ప్రజల కోసమే.. ప్రజల వద్దకే..
ఎన్నికల మేనిఫెస్టో అంటే కేవలం నాయకులు రాసేది కాదని, అది ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబంలా ఉండాలని విజయ్ భావిస్తున్నారు. అందుకే, ప్రజల అవసరాలు మరియు అభిప్రాయాలకు అనుగుణంగా మేనిఫెస్టోను రూపొందించేందుకు టీవీకే పార్టీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ’ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టనుంది.
జోన్ల వారీగా పర్యటన షెడ్యూల్: ఈ కమిటీ రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో పర్యటించి ప్రజలతో నేరుగా మాట్లాడనుంది:
- ఫిబ్రవరి 1: మధురై
- ఫిబ్రవరి 4: కడలూరు
- ఫిబ్రవరి 7: కోయంబత్తూరు
- ఫిబ్రవరి 9: తిరుచిరాపల్లి
- ఫిబ్రవరి 11: చెన్నై
ఇది కూడా చదవండి: Virat Kohli: మాయమైన విరాట్ కోహ్లీ.. ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్న అభిమానులు
ఓపీనియన్ బాక్స్ మరియు డిజిటల్ వేదికలు..
ప్రతి ప్రాంతంలో సామాజిక కార్యకర్తలు, ఎన్జీఓలు మరియు సామాన్య ప్రజల కోసం సమావేశాలు ఏర్పాటు చేస్తారు. అక్కడ ‘పీపుల్స్ ఓపీనియన్ బాక్స్’ (ప్రజల అభిప్రాయ సేకరణ పెట్టె)లను ఉంచుతారు. ప్రజలు తమ సమస్యలు, కోరికలు మరియు సలహాలను అందులో వేయవచ్చు. కేవలం క్షేత్రస్థాయిలోనే కాకుండా, సోషల్ మీడియా మరియు డిజిటల్ వేదికల ద్వారా కూడా ఓటర్ల నుంచి సూచనలు తీసుకోనున్నారు. రైతులు, మహిళలు, యువత, మత్స్యకారులు మరియు కార్మికుల అవసరాలకు ఈ మేనిఫెస్టోలో పెద్దపీట వేయాలని విజయ్ నిర్ణయించుకున్నారు.
ఎవరికీ తలవంచేది లేదు..
ఇటీవలే జరిగిన ఒక సమావేశంలో విజయ్ తన రాజకీయ వైఖరిని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో తన పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోదని తేల్చి చెప్పారు. “ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎంత ఒత్తిడి చేసినా వెనక్కి తగ్గేది లేదు. ఇది కేవలం ఎన్నికలు మాత్రమే కాదు.. ఇదొక ప్రజాస్వామ్య యుద్ధం” అని విజయ్ ప్రకటించారు. తమిళనాడు అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించడమే తన లక్ష్యమని ఆయన ‘ఎక్స్’ వేదికగా ధీమా వ్యక్తం చేశారు.
தமிழகத்தில் சட்டம் ஒழுங்கு சீரழிந்துவிட்டது என்பதற்குச் சான்றாக நாள்தோறும் குற்றச் சம்பவங்கள் அதிகரித்து வருகின்றன.
தலைநகர் சென்னையில் அடுத்தடுத்த பாலியல் வன்கொடுமைச் சம்பவங்களால் தமிழகமே அதிர்ச்சியில் ஆழ்ந்துள்ளது.சென்னை அடையாறு பகுதியில் காவலாளியாக வேலை பார்த்து வந்த பீகார்…
— TVK Vijay (@TVKVijayHQ) January 29, 2026
