Jailer 2

Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’లో విజయ్ సేతుపతి?

Jailer 2: సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న జైలర్-2 సినిమా రోజురోజుకూ హైప్ పెంచేస్తుంది. తాజాగా విజయ్ సేతుపతి కూడా ఈ చిత్రంలో చేరినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గోవా షెడ్యూల్‌లో ఆయన పాల్గొంటున్నారని సమాచారం. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన కూలీ సినిమాతో ఓ మోస్తారు హిట్ అందుకున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. ఇప్పుడు నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో రూపొందుతున్న జైలర్-2 సినిమా ప్రస్తుతం గోవా షూటింగ్‌లో ఉంది.

Also Read: Andhra King Taluka Review: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ రివ్యూ: పిచ్చి అభిమానం.. భావోద్వేగాల ప్రయాణం!

ఈ చిత్రంలో రజనీకాంత్‌తో పాటు శివరాజ్‌కుమార్, రమ్యకృష్ణ, జాకీ శ్రాఫ్ వంటి ప్రముఖులు నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో స్టార్ నటుడు విజయ్ సేతుపతి కూడా ఈ ప్రాజెక్టులో జాయిన్ అయినట్టు టాక్. గోవా షెడ్యూల్‌లో ఆయన షూటింగ్‌లో పాల్గొంటున్నట్టు సమాచారం. అయితే ఆయన పాత్ర గురించి ఇంకా ఎలాంటి వివరాలు బయటకు రాలేదు. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం 2026లో రిలీజ్ కానుంది. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *