Vijay Sethupathi-Nithya Menen: రీసెంట్ గా ‘మహారాజా’ చిత్రంలో హిట్ కొట్టిన విజయ్ సేతుపతి పస్తుతం సినిమాలతో పాటు తమిళ బిగ్ బాస్ హోస్ట్ గానూ బిజీగా ఉన్నారు. తాజాగా పాండిరాజ్ దర్శకత్వంలో ఓ మూవీ చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు విజయ్ సేతుపతి. ‘పసంగ, మెరీనా, కేడీ బిల్లా కిలాడి రంగ, పసంగ2, ఇది నమ్మ ఆలు, కథాకళి, కడైకుట్టి సింగం’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు పాండిరాజ్. పేరు పెట్టని ఈ చిత్రంలో విజయ్ సేతుపతికి జోడీగా జాతీయ ఉత్తమనటి నిత్యామీనన్ ను ఎంపిక చేశారు. ఈ సినిమా షూటింగ్ మంగళవారం తిరు చెందూరులో పూజతో ఆరంభం అయింది. తరుపరి షెడ్యూల్ ను తూత్తుకుడి, రామేశ్వరం పరిసరాల్లో చిత్రీకరిస్తారట.
విజయ్ సేతుపతి నటించిన ‘విడుదలై2’ డిసెంబర్ లో విడుదల కానుంది. కిశోర్ పాండురంగ బాలేకర్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి చేసిన సైలెంట్ మూవీ ‘గాంధీ టాక్స్’ రిలీజ్ కావలసి ఉంది. ఆర్మగ కుమార్ డైరెక్షన్ లో చేసిన ‘ఏస్’ సినిమా షూటింగ్ పూర్తయింది. మిస్కిన్ డైరెక్ట్ చేసిన ‘ట్రైన్’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. ఇవి కాకుండా ‘పిశాశి2’, ఇప్పుడు పాండిరాజ్ సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. రాబోయే ఈ చిత్రాలతో విజయ్ సేతుపతి ఏ స్థాయి విజయాలను అందుకుంటాడో చూడాలి.