Jana Nayagan: తమిళ స్టార్ హీరో విజయ్ కి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది ఎప్పుడైతే విజయ్ రాజకీలోకి వెళ్తాను అని అనౌన్స్ చేశాడో అప్పటినుండి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇపుడు తన లాస్ట్ సినిమా ‘జన నాయకన్’ తీవ్ర వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమాకు సంబంధించిన హై-డెఫినిషన్ (HD) ప్రింట్ ఇంటర్నెట్‌లో లీక్ అవ్వడం ఇప్పుడు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తోంది.
థియేటర్లలో విడుదల కాకముందే ఈ సినిమా పూర్తి హెచ్‌డీ వెర్షన్ పైరసీ వెబ్‌సైట్లలో ప్రత్యక్షమైంది. అంతకుముందు సినిమాలోని టైటిల్ కార్డ్స్, ఇంట్రడక్షన్ సీన్ ఇంకా క్లైమాక్స్ క్లిప్పులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
వాస్తవానికి ఈ ఏడాది జనవరి 9న విడుదల కావాల్సిన ఈ సినిమాను, సెన్సార్ బోర్డు (CBFC) అభ్యంతరాల వల్ల వాయిదా వేశారు. సినిమాలోని కొన్ని సన్నివేశాలు ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని బోర్డు భావించింది.
చిత్ర యూనిట్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ, ఒక నెల రోజుల న్యాయ పోరాటం తర్వాత కేసును ఉపసంహరించుకుని, సినిమాను రివైజింగ్ కమిటీకి పంపడానికి అంగీకరించారు.
విజయ్ తన రాజకీయ పార్టీ ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) ద్వారా రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో, ఈ సినిమా విడుదలపై సందిగ్ధత నెలకొంది. ఎన్నికలు ముగిసే వరకు ఈ సినిమాకు క్లియరెన్స్ లభించే అవకాశం లేదని తెలుస్తోంది.
సినిమా వివరాలు..
కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, ప్రకాష్ రాజ్ మరియు ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇది విజయ్ కెరీర్‌లో 69వ మరియు ఆఖరి చిత్రం కావడం విశేషం.
