Vijay: తమిళ అగ్ర కథానాయకుడు, టీవీకే అధినేత దళపతి విజయ్‌కు చెన్నై విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. మలేషియాలో తన చివరి చిత్రం ‘జన నాయగన్’ ఆడియో వేడుకను ముగించుకుని ఆదివారం రాత్రి ఆయన చెన్నై చేరుకున్నారు. విజయ్‌కు స్వాగతం పలికేందుకు భారీ సంఖ్యలో అభిమానులు ఎయిర్‌పోర్టుకు పోటెత్తారు. పోలీసులు వారిని అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ, అభిమానులు ఒక్కసారిగా విజయ్ వైపు దూసుకురావడంతో తీవ్ర గందరగోళం నెలకొంది.
Also Read: Madhuri deekshit: సినిమా టికెట్ల ధరలే థియేటర్లకు ప్రేక్షకులు తగ్గడానికి కారణం
ఈ తోపులాట మధ్య విజయ్ తన కారు వద్దకు వెళ్తుండగా ఒక్కసారిగా కాలుజారి కిందపడిపోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయనను పైకి లేపి, సురక్షితంగా కారులో ఎక్కించారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో విజయ్‌కు ఎలాంటి గాయాలు కాలేదని తెలియడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో, సెలబ్రిటీల భద్రతపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
VIDEO | TVK chief Vijay stumbled and fell while trying to get into his car at the Chennai airport.
A large crowd of fans gathered to welcome him as he returned from Malaysia.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/x42Kpd0AsW
— Press Trust of India (@PTI_News) December 28, 2025
