Vijay Deverakonda: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. రవికిరణ్ కోలా దర్శకత్వంలో ‘రౌడీ జనార్థన’తో మాస్ ఎంటర్‌టైనర్ ఇస్తున్నారు. ఇక రాహుల్ సాంకృత్యాన్‌తో ‘రణబాలి’ అనే పవర్‌ఫుల్ ప్రాజెక్ట్ కూడా లైన్‌లో ఉంది. ఇప్పుడు మరో ఆసక్తికర వార్త వినిపిస్తోంది. ‘ఇష్క్’, ’24’, ‘మనం’ లాంటి హిట్‌లు ఇచ్చిన దర్శకుడు విక్రమ్ కె కుమార్‌తో విజయ్ ఓ సినిమా చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో టాక్ రచ్చగా మారింది. ఇది విజయ్ ఎన్నడూ టచ్ చేయని కొత్త కథ అని, తన పాత్ర నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని అంటున్నారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
Also Read: Sumathi Shathakam Trailer: తిరుపతిలో ఘనంగా ‘సుమతి శతకం’ ట్రైలర్ లాంచ్
ప్రస్తుతం విజయ్ దేవరకొండ రెండు భిన్న జానర్ల సినిమాలతో బిజీగా ఉన్నారు. రవికిరణ్ కోలాతో ‘రౌడీ జనార్థన’ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా షూటింగ్ సాగుతోంది. అదే సమయంలో రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ‘రణబాలి’ అనే టైటిల్‌తో మరో ప్రాజెక్ట్ ప్రారంభమైంది. రెండూ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేపుతున్నాయి. ఇక ఇవి పూర్తి కాకముందే మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. ‘ఇష్క్’తో ఫేమస్ అయిన దర్శకుడు విక్రమ్ కె కుమార్ విజయ్‌తో కలిసి సినిమా చేయబోతున్నారట. ఈ కథ విజయ్ ఇప్పటివరకు టచ్ చేయనిదని, హీరో పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుందని సినీ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. మొదట ఈ స్టోరీ నితిన్‌కు రాసుకున్నదని కానీ ఇప్పుడు విజయ్‌కు షిఫ్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే హీరో, దర్శకుడు నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. ఈ కాంబినేషన్ సెట్ అవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. అభిమానులు ఈ వార్తపై హైప్‌లో ఉన్నారు. మరికొద్ది రోజుల్లో అఫీషియల్ అప్‌డేట్ వస్తుందేమో చూడాలి.
