Vijay Deverakonda: టాక్ తో సంబంధం లేకుండా సాలిడ్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది కింగ్ డమ్.. ఫస్ట్ డే విజయ్ దేవరకొండ కెరీర్ లో హయ్యస్ట్ కలెక్షన్స్ రాబట్టింది. వరుస ఫ్లాపుల తర్వాత రౌడీ హీరోలో కొత్త జోష్ తీసుకొచ్చిందీ మూవీ. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన కింగ్ డమ్ లో సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే నటించారు. ఎన్టీఆర్ కోసం ఈ సినిమా టైటిల్ వదులుకున్నామంటూ రీసెంట్ గా విజయ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..
Also Read: Tom Cruise: హాలీవుడ్ లెజెండ్ టామ్ క్రూజ్, అనా డి అర్మాస్‌ల రొమాంటిక్ జర్నీ సంచలనం సృష్టిస్తోంది.
కింగ్ డమ్ రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ 53 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. సక్సెస్ ప్రెస్ మీట్ లో విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ షేర్ చేసుకుంటున్నాడు. ఈ మూవీకి ముందుగా నాగ దేవర అనే పేరు ఫిక్స్ చేసుకున్నామని.. అయితే తారక్ అన్న దేవర సినిమా కోసం ఆ టైటిల్ వదులుకున్నామని చెప్పాడు. అందుకే తారక్, కింగ్ డమ్ టీజర్ కి వాయిస్ ఓవర్ ఇచ్చాడేమో అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.