Vijay-Rashmika: సుదీర్ఘ కాలం పాటు ప్రేమ పక్షులుగా వార్తల్లో నిలిచిన టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎట్టకేలకు ఒక ఇంటివారయ్యారు. వీరి వివాహ వేడుక అనంతరం, గురువారం రాత్రి హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ స్టార్ హోటల్‌లో అత్యంత వైభవంగా వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుకకు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన దిగ్గజాలతో పాటు, ఉభయ రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు తరలివచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు.






