Vijay Deverakonda: టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ భారీ చిత్రాలతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో “కింగ్డమ్” చిత్రంతో బిజీగా ఉన్న విజయ్, త్వరలో టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్‌తో మరో సాలిడ్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నాడు. గతంలో “ట్యాక్సీవాలా”తో ఈ కాంబినేషన్ ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి సినీ ప్రియులకు మరో విభిన్న చిత్రాన్ని అందించేందుకు రెడీ అవుతున్నారు.
Also Read: Nagarjuna: పాన్ ఇండియా సినిమాలపై నాగార్జున సంచలన వ్యాఖ్యలు!
Vijay Deverakonda: ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా, హీరోయిన్‌గా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఎంపికైనట్లు తాజా సమాచారం. దర్శకుడు రాహుల్ సంకృత్యాన్, నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నుంచి వచ్చిన హింట్స్‌తో ఈ విషయం దాదాపు కన్ఫర్మ్ అయింది. అయితే, అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది. విజయ్ – రష్మిక జోడీ గత చిత్రాల్లో సూపర్ హిట్ కెమిస్ట్రీతో అలరించిన నేపథ్యంలో, ఈ కొత్త ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ రానున్నాయని టాక్.