Vijay Deverakonda: విజయ్ దేవరకొండ వరుస ప్లాపుల్లో ఉన్నా కూడా వరుస ప్రాజెక్టులతో బిజీ అవుతున్నాడు. ఇప్పటికే రెండు కొత్త సినిమాలకు ఒప్పుకున్నాడు. అందులో ఒకటి పీరియాడిక్ డ్రామా కాగా, ఇంకోటి పక్కా మాస్ సినిమా. అయితే విజయ్ పీరియాడిక్ డ్రామా బదులు ముందు రౌడీ జనార్ధన్ లాంటి మాస్ సినిమా చేయనున్నాడు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
Also Read: Darshan: జూనియర్ ప్రభాస్‌గా మహేశ్ మేనల్లుడు?
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రెండు కొత్త సినిమాలతో బిజీగా మారాడు. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న భారీ పీరియాడిక్ డ్రామా ఒకటి. మరోటి రవికిరణ్ కోలా దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న గ్రామీణ మాస్ ఎంటర్‌టైనర్ రౌడీ జనార్ధన్. మొదట పీరియాడిక్ సినిమా షూట్ పూర్తి చేయాలనుకున్న విజయ్, భారీ బడ్జెట్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎక్కువగా ఉండటంతో ప్లాన్ మార్చాడు. ముందు రౌడీ జనార్ధన్‌పై దృష్టి పెట్టాడు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ ఇప్పటికే ప్రారంభమైంది. విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ లపై ముఖ్య సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని బృందం భావిస్తోంది. ఇక పీరియాడిక్ చిత్రం 2027లో విడుదల కానుంది. ఇది ఖచ్చితంగా విజయ్ కెరీర్‌లో మరో మైలురాయి అవుతుందని అంచనాలు ఉన్నాయి.

