Kingdom-2: యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ అభిమానులకు ఇది నిజంగా నిరాశ కలిగించే వార్త! భారీ అంచనాల మధ్య, రెండు భాగాలుగా ప్లాన్ చేసిన పీరియడ్ యాక్షన్ డ్రామా ‘కింగ్డమ్’ తొలి భాగం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవ్వడంతో, దాని సీక్వెల్ ‘కింగ్డమ్ 2’ భవిష్యత్తుపై తీవ్ర అనిశ్చితి నెలకొంది.
దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం అట్టహాసంగా విడుదలైనా, ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది.
బడ్జెట్ VS వసూళ్లు: భారీ నష్టాల లెక్క!
‘కింగ్డమ్’ సినిమాను దాదాపు ₹130 కోట్ల బడ్జెట్‌తో రూపొందించినట్లు తెలుస్తోంది. ఫ్యాన్ ఇండియా స్థాయిలో విజయ్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని నిర్మాతలు ఈ స్థాయిలో ఖర్చు చేశారు. అయితే, విడుదలైన తొలిరోజు నుంచే వచ్చిన బలహీనమైన టాక్ కారణంగా, సినిమా కేవలం ₹82 కోట్లు మాత్రమే వసూలు చేసిందనే ప్రచారం సినీ పరిశ్రమలో బలంగా ఉంది.
ఇది కూడా చదవండి: Vijaysai Reddy: హిందూ మతం పై కుట్రలు సహించేది లేదు
తొలి వారాంతం తర్వాత కలెక్షన్లు పూర్తిగా పడిపోవడంతో, ఈ సినిమా పెట్టిన పెట్టుబడిలో అత్యధిక భాగాన్ని తిరిగి రాబట్టలేకపోయింది. దీంతో నిర్మాణ సంస్థకు భారీ నష్టాలు తప్పలేదని సమాచారం. ఈ వాణిజ్య వైఫల్యమే ఇప్పుడు సీక్వెల్ భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేసింది.
సీక్వెల్ పనులకు బ్రేక్: ఇండస్ట్రీలో గుసగుస
‘కింగ్డమ్’ సినిమాను రెండు భాగాలుగా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. తొలి భాగం థియేటర్లలోకి రాకముందే, రెండో భాగం స్క్రిప్ట్ వర్క్, విజువల్ ప్లానింగ్ వంటి ప్రీ-ప్రొడక్షన్ పనులు చురుగ్గా సాగాయి. కానీ, మొదటి భాగం బాక్సాఫీస్ ఫలితం తీవ్ర నిరాశ కలిగించడంతో, నిర్మాతలు ఒక్కసారిగా వెనకడుగు వేశారని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Harish Rao: రెండు రోజుల్లో డబ్బులు వేస్తాం అన్నారు.. 50 రోజులైనా ఇంకా పడలేదు
మళ్లీ అంతటి భారీ పెట్టుబడి పెట్టేందుకు నిర్మాణ సంస్థ సందేహంలో పడిందట. అంతర్గత సమాచారం ప్రకారం, ‘కింగ్డమ్ 2’ చిత్ర నిర్మాణ పనులను ప్రస్తుతానికి పూర్తిగా నిలిపివేశారు. ఈ వార్త విజయ్ అభిమానులను షాక్‌కు గురి చేసింది. 2025లో విజయ్‌కి ఈ సినిమా రూపంలో అదృష్టం కలిసి రాలేదనే టాక్ బలంగా ఉంది.
అధికారిక ప్రకటన ఎప్పుడు?
విజయ్ దేవరకొండ – భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన ఈ చిత్రం సీక్వెల్ రద్దు గురించి సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నా, ఇప్పటివరకు చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
కొంతమంది ఫ్యాన్స్ సీక్వెల్లో కథను చూడాలని ఉత్సాహంగా ఉన్నా, మొదటి భాగం ఇచ్చిన అనుభవం దృష్ట్యా, మరికొంతమంది “సీక్వెల్ చేయకపోవడమే బెటర్” అనే అభిప్రాయంతో ఉన్నారు.
అధికారికంగా దర్శకుడి లేదా నిర్మాతల నుంచి ఒక స్పష్టత వచ్చే వరకు, ‘కింగ్డమ్ 2’ నిలిపివేత వార్తలు కేవలం రూమర్స్‌గానే పరిగణించాలి.

