Vijay Devarakonda: జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలో ఉండవల్లి సమీపంలో ప్రముఖ టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ కారు ప్రమాదానికి గురయ్యారు.
వివరాల్లోకి వెళ్తే — విజయ్ దేవరకొండ తన స్నేహితులతో కలిసి పుట్టపర్తికి వెళ్లి వస్తుండగా, ఆయన ప్రయాణిస్తున్న కారు నియంత్రణ కోల్పోయి ప్రమాదానికి గురైనట్లు సమాచారం.
అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో విజయ్ దేవరకొండ సురక్షితంగా బయటపడ్డారు. ఆయనకు ఎటువంటి గాయాలు జరగలేదు. కేవలం ఆయన కారుకు మాత్రమే స్వల్ప నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
ప్రమాదం అనంతరం విజయ్ దేవరకొండ తన స్నేహితుడి కారులో అక్కడి నుంచి బయలుదేరినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
స్థానికులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. రోడ్డు పరిస్థితులు లేదా వేగం కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.