Lucky Baskhar: దీపావళి కానుకగా ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు ‘లక్కీ భాస్కర్’. దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం 31న రిలీజ్ అవుతోంది. ఇదిలా ఉంటే 27న ప్రీరిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఈ వేడుకకు త్రివిక్రమ్ తో పాటు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథులుగా రాబోతున్నట్లు మేకర్స్ తెలియచేశారు. జీవి ప్రకాశ్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు ఇప్పటికే ప్రేక్షకాదరణ పొందాయి. షేర్ మార్కెట్ నేపథ్యంలో ‘లక్కీ భాస్కర్’ ని తెరకెక్కించినట్లు ఇటీవల దర్శకుడు రివీల్ చేశారు. ఇదిలా ఉంటే ఈ నెల 30న ఎపి, తెలంగాణలో ప్రీమియర్ షోస్ ప్లాన్ చేశారు. దాదాపు 100 ప్రీమియర్ షోస్ వేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఫార్చూన్ సినిమాస్ తో కలసి శ్రీకరస్టూడియోస్ పై నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వరుస విజయాలతో ఊపు మీదున్న దుల్కర్ కి ‘లక్కీ భాస్కర్’ మరో హిట్ గా నిలిస్తుందేమో చూద్దాం.

