vijay devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘కింగ్ డమ్’ సినిమా ప్రమోషన్లలో తలమునకలయ్యాడు. ఇదిలా ఉండగా, తన కెరీర్‌కు సంబంధించి వరుసగా కొత్త ప్రాజెక్టులను లైన్‌లో పెడుతూ ఉన్నాడు. తాజాగా ఫిలింఫేర్ మేగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాలతో పాటు, సినీ ప్రయాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “సినిమాల విషయంలో నేను ఎప్పుడూ దర్శకుల మాటే నమ్ముతాను. వాళ్లు చెప్పిందే చేస్తాను. సందీప్ రెడ్డి వంగా, నాగ్ అశ్విన్, తరుణ్ భాస్కర్ లాంటి డైరెక్టర్లు నా కెరీర్‌కి బలమైన మద్దతుగా నిలిచారు” అని విజయ్ తెలిపాడు. ఇక పెళ్లిపై ప్రశ్నించగా – “ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు. ప్రస్తుతం నా ఫోకస్ అంతా కెరీర్‌పైనే. రష్మిక చాలా మంచి అమ్మాయి. ఆమెతో ఇంకొన్ని సినిమాలు చేయాలనుంది. అద్భుతంగా నటించే నటి” అని పేర్కొన్నాడు. అంతేకాదు, “మీకు రష్మికలో కాబోయే భార్య లక్షణాలు కనిపిస్తాయా?” అని అడిగిన ప్రశ్నకు విజయ్ స్పందిస్తూ – “మంచి మనసున్న అమ్మాయి ఎవరైనా సరే” అంటూ సమాధానం ఇచ్చాడు. ఇది వింటే రష్మికను ఉద్దేశించినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. విజయ్ మాటలలో రష్మికను మొదట మంచి అమ్మాయిగా పేర్కొనడం, తర్వాత మంచి మనసున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పడం చూసి ఫ్యాన్స్ మాత్రం – “ఇది స్పష్టమైన హింట్… ఓకే చెప్పేశాడే!” అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి, రష్మికతో రిలేషన్ విషయాన్ని విజయ్ పరోక్షంగా ఒప్పుకున్నట్టే అంటున్నారు ఆయన అభిమానులు.
