Vijay 69: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. రజనీకాంత్ తర్వాత దక్షిణ భారతంలో మోస్ట్ ఫాలోయింగ్ ఉన్న హీరోగా నిలిచిన విజయ్, ఇప్పుడు తన రాజకీయ ప్రస్థానానికి మళ్లీ కీలక అడుగు వేస్తున్నాడు. ఇక సినిమా రంగంలో మాత్రం తన చివరి చిత్రంగా జన నాయకుడు (తమిళంలో జన నాయగన్)ను రూపొందిస్తున్నాడు.
ఈ సినిమాకు హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. పూజా హెగ్డే, మమితా బైజు హీరోయిన్లుగా నటిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ నిర్మిస్తున్నారు.
బర్త్‌డే కానుకగా పవర్‌ఫుల్ లుక్
విజయ్ జన్మదినం (జూన్ 22) సందర్భంగా, చిత్ర బృందం జన నాయకుడు సినిమా నుంచి ఓ రోరింగ్ లుక్‌ను విడుదల చేసింది. ఇందులో విజయ్ పోలీస్ యూనిఫాం ధరించి చాలా పవర్‌ఫుల్‌గా కనిపించారు. పోస్టర్ విడుదలతో విజయ్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. సోషల్ మీడియా మొత్తం ఈ లుక్‌తో హల్చల్ అవుతోంది.
భగవంత్ కేసరి రీమేక్ కాదట
ఈ మూవీ తెలుగులో బాలకృష్ణ భగవంత్ కేసరికి రీమేక్ అని కొంత కాలంగా వార్తలు వస్తున్నా, మేకర్స్ మాత్రం స్పష్టంగా తేల్చేశారు – ఇది ఓ పూర్తి కొత్త కథ అని. అసలు రీమేక్ కాదు, కథ కూడా బలంగా ఉండేలా ప్లాన్ చేశామంటూ చెబుతున్నారు.
రిలీజ్ డేట్ ఫిక్స్
ఈ భారీ ప్రాజెక్ట్‌ను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. 2026 జనవరి 9న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది.
రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్
ఇదే సమయంలో విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. దీంతో జన నాయకుడు మూవీ, ఆయన కెరీర్‌కు గానీ, రాజకీయ ప్రస్థానానికి గానీ ఒక మైలురాయిగా నిలవబోతోందని అభిమానులు భావిస్తున్నారు.
ఈ బర్త్‌డే విజయ్‌కు చాలా ప్రత్యేకంగా మారింది. 50 ఏళ్లను పూర్తి చేసి 51వ ఏడాదిలోకి అడుగుపెట్టిన ఆయనకు, అభిమానుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక జన నాయకుడు పోస్టర్‌తో అందరినీ మరోసారి ఆకట్టుకున్నారు.


