Vigilance Raids

Vigilance Raids: ఏపీ వ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో విజిలెన్స్ తనిఖీలు..6 కేసులు నమోదు

Vigilance Raids: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా విజిలెన్స్ అధికారులు పెట్రోల్ బంకుల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మొత్తం 73 బంకుల్లో 36 బృందాలు సోదాలు చేపట్టగా, లీగల్ మెట్రాలజీ చట్టం కింద 6 కేసులు నమోదు చేశారు.

తనిఖీల్లో బయటపడిన అక్రమాలు

  • నెల్లూరు: ₹32.77 లక్షల విలువైన పెట్రోల్, 14.85 లీటర్ల డీజిల్, 561 లీటర్ల 2టీ ఆయిల్ సీజ్
  • అనంతపురం: ₹75,000 విలువైన 3 పల్సర్ బోర్డులు స్వాధీనం
  • కర్నూలు: ఒక పెట్రోల్ బంక్‌కు ₹25,000 జరిమానా

పెట్రోల్ కొలతల్లో ట్యాంపరింగ్

విజిలెన్స్ అధికారులు పల్సర్ బోర్డుల ట్యాంపరింగ్ గుర్తించారు.

  • ఆత్మకూరు – 1 చిప్
  • అనంతపురం – 2 అదనపు చిప్స్
  • రాజమండ్రి – 5 లీటర్ల పెట్రోల్‌కు 50 ఎంఎల్ తక్కువ
  • ఏలూరు – 5 లీటర్లకు 30 ఎంఎల్ తక్కువ
  • నెల్లూరు – 40 ఎంఎల్ తక్కువ

కఠిన చర్యలు తప్పవన్న విజిలెన్స్ డీజీ

విజిలెన్స్ డీజీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ, బంకుల్లో అక్రమాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీలు తదుపరి రోజుల్లో కూడా కొనసాగుతాయి అని తెలిపారు.

ఇది కూడా చదవండి: PM Kisan: ఒక్కొక్క రైతు ఖాతాలోకి రూ.2వేలు.. పీఎం కిసాన్ నిధులు విడుదల..

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Bhatti vikramarka: రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *