Vidya Vox: పాప్ సింగర్ విద్యా వోక్స్ కు అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉంది. చెన్నయ్ లో పుట్టిన విద్యా అయ్యర్… ఫ్యామిలీతో పాటు ఎనిమిదేళ్ళ వయసులోనే అమెరికా వెళ్ళిపోయింది. అక్కడే సంగీతాన్ని అభ్యసించి పాప్ సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా నితిన్ హీరోగా రూపుదిద్దుకుంటున్న ‘రాబిన్ హుడ్’ మూవీతో విద్యా వోక్స్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇందులోని ‘వన్ మోర్ టైమ్’ పాటను విద్యా వోక్స్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాశ్ కుమార్ తో కలిసి పాడింది. డిసెంబర్ 25న విడుదల కాబోతున్న ‘రాబిన్ హుడ్’ పై చక్కని అంచనాలే ఉన్నాయి. గతంలో నితిన్, వెంకీ కుడుముల కాంబోలో వచ్చిన ‘భీష్మ’ మూవీ సక్సెస్ కావడమే దీనికి కారణం. ఇప్పుడీ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.

