Dragon: ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ కలయికలో రూపొందుతున్న ‘డ్రాగన్’ చిత్రం గురించి తాజా అప్‌డేట్ అభిమానులను ఆకర్షిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ విద్యా బాలన్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ప్రశాంత్ నీల్ సినిమాల్లో క్యారెక్టర్స్ ఎప్పుడూ బలంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ కెరీర్‌లోనే బెస్ట్ సినిమాగా నిలిపేందుకు నీల్ గట్టిగా కసరత్తు చేస్తున్నారు. స్క్రిప్ట్ కోసం ఎక్కువ సమయం తీసుకున్న ఆయన, ఈ మూవీని ఊహించని స్థాయిలో తీర్చిదిద్దుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ‘డ్రాగన్’ అంచనాలను మరింత పెంచుతూ నిత్యం కొత్త రూమర్స్ వినిపిస్తున్నాయి!
