Vidya Balan: బాలీవుడ్ బాబులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘భూల్ భూలయ్యా3’. దీపావళి కానుకగా రాబోతున్న ఈ సినిమా నుంచి ‘అమీ జే తోమర్’ పాటను రిలీజ్ చేశారు. ఈ పాటలో లెజెండరీ నటీమణులు విద్యాబాలన్, మాధురీ దీక్షిత్ నటించటం విశేషం 17 సంవత్సరాల క్రితం విద్యాబాలన్ పై ‘భూల్ భూలయ్య’ కోసం చిత్రీకరించిన ‘అమీ జో తోమర్’ ఇది లేటెస్ట్ వెర్షన్. నిజానికి ఇది మలయాళ చిత్రం ‘మణిచిత్రతాళ్’ కి రీమేక్. దీనినే రజనీకాంత్ తో 2005లో ‘చంద్రముఖి’గా తీశారు. ఈ మూవీ అన్ని భాషల్లోనూ ఘన విజయం సాధించింది. బాలీవుడ్ లో దీనికి సీక్వెల్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ‘భూల్ భూలయ్య3’ రాబోతోంది. కార్తీక్ ఆర్యన్, విద్యాబాలన్, మాధురీ దీక్షిత్, త్రిప్తి డిమ్రీ నటించిన ఈ సినిమాకు అనీస్ బజ్మీ దర్శకత్వం వహంచారు. నవంబర్ 1న రాబోతున్న ఈ అతీంద్రీయ కామెడీ ఎంటర్ టైనర్ ‘సింగమ్ ఎగైన్’తో పోటీ పడుతోంది.
