Vidadala Rajini:

Vidadala Rajini: ఏపీ మాజీ మంత్రి విడుద‌ల ర‌జినిపై ఏసీబీ కేసు?

Vidadala Rajini: గ‌త వైఎస్సార్ ప్ర‌భుత్వ హ‌యాంలో అప్ప‌టి మంత్రిగా ప‌నిచేసిన విడుద‌ల ర‌జిని ఓ క్ర‌ష‌ర్ మిల్లు య‌జ‌మాన్యాన్ని బెదిరించి అక్ర‌మంగా డ‌బ్బు వ‌సూలు చేశార‌నే అభియోగంతో ఆమెపై ఏసీబీ కేసు న‌మోదు చేసింది. ఇప్ప‌టికే ఆమెపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై ఏసీబీ అధికారులు విచార‌ణ చేప‌ట్టారు. ఆ విచార‌ణ‌లో ప‌క్కా ఆధారాలు ల‌భ్యంకావ‌డంతో ఆమెను ఏ1గా పేర్కొంటూ ఏసీబీ అధికారులు కేసు న‌మోదు చేశారు.

Vidadala Rajini: ఇదే కేసులో ఆమెతో పాటు అప్ప‌టి గుంటూరు ఆర్‌వీఈవో, ఐపీఎస్ అధికారి అయి ప‌ల్లె జాషువా ఏ3గా, ర‌జిని మ‌రిది గోపి ఏ3గా, ర‌జ‌ని పీఏ దొడ్డా రామ‌కృష్ణను ఏ4 నిందితులుగా ఈ కేసులో పేర్కొన్నారు. వైఎస్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ఉండ‌గా, ప‌ల్నాడు జిల్లా య‌డ్ల‌పాడులోని శ్రీ ల‌క్ష్మీబాలాజీ స్టోన్ క్ర‌ష‌ర్ యాజ‌మాన్యాన్ని విజిలెన్స్ త‌నిఖీల ముసుగులో బెదిరించి వారి నుంచి రూ.2.20 కోట్ల‌ను అక్ర‌మంగా వ‌సూలు చేశార‌నే అభియోగంతో ర‌జని, త‌దిత‌రుల‌పై ఈ కేసు న‌మోదైంది.

Vidadala Rajini: అవినీతి నిరోధ‌క చ‌ట్టంలోని 7, 7ఏ, ఊపీసీ 384, 120బీ సెక్ష‌న్ల‌ను వ‌ర్తింప‌జేస్తూ ఏసీబీ కేసు న‌మోదు చేసిన‌ట్టు తెలుస్తున్న‌ది. ఏసీబీ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ హ‌రీశ్‌కుమార్ గుప్తా విచార‌ణ మేర‌కు ప్ర‌భుత్వానికి ఓ నివేదిక‌ను స‌మ‌ర్పించార‌ని, ఆ సిఫార‌సు మేర‌కు ప్ర‌భుత్వం ఏసీబీ విచార‌ణకు ఆదేశించిన‌ట్టు తెలిసింది. ఏసీబీ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ అతుల్ సింగ్ ప్రాథ‌మిక ద‌ర్యాప్తు చేయించార‌ని తెలిసింది.

Vidadala Rajini: స్టోన్ క్ర‌ష‌ర్‌పై దాడులు చేయ‌కుండా, మూయించ‌కుండా ఉండాలంటే ఎమ్మెల్యేని కల‌వాల‌ని దాని యాజ‌మాన్యానికి కొంద‌రి చేత‌ హుకూం జారీ చేయించారు. దాంతో ఆ స్టోన్ క్ర‌ష‌ర్‌ య‌జమానులైన న‌ల్ల‌ప‌నేని చ‌ల‌ప‌తిరావు, నంబూరి శ్రీనివాస్‌రావు క‌లిసి ర‌జిని కార్యాల‌యానికి వెళ్లారు. త‌న నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో మీ బిజినెస్‌ న‌డ‌వాలంటే అడిగినంత డ‌బ్బులివ్వాల్సిందేన‌ని, ఇత‌ర విష‌యాలు త‌న పీఏతో మాట్లాడాలంటూ తేల్చి చెప్పారు. వెంట‌నే ఆమె పీఏ రామ‌కృష్ణను క‌లిశారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న రూ.5 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు.

Vidadala Rajini: ఇదిలా ఉండ‌గానే ఆరు రోజుల తర్వాత గుంటూరు రీజన‌ల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారిగా ఉన్న ఐపీఎస్ అధికారి ప‌ల్లె జాషువా త‌న సిబ్బందితో క‌లిసి శ్రీ ల‌క్ష్మీబాలాజీ స్టోన్ క్ర‌ష‌ర్ మిల్లుపై ఏకంగా దాడి చేసినంత ప‌నిచేశాడు. త‌నిఖీల పేరిట హ‌డావుడి చేశాడు. అయితే ఈ విష‌యం అప్ప‌టి విజిలెన్స్ డీజీ నుంచి అనుమ‌తి తీసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. హెడ్ ఆఫీసుకు కూడా ఈ విష‌యాన్ని చేర‌వేయ‌లేదు. క‌నీసం ఎవ‌రూ ఫిర్యాదు చేయ‌కుండా స్టోన్ క్ర‌ష‌ర్ మిల్లుపై దాడికి వెళ్లారు. ఈ విష‌యాల‌తో కూడిన ఆధారాలు ల‌భ్యం కావ‌డంతో ఏసీబీ అధికారులు ప్రాథ‌మిక రిపోర్ట్ సేక‌రించి నివేదిక‌ను అంద‌జేశారు. ఆ మేర‌కు కేసు న‌మోదు చేసిన‌ట్టు తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *