Vice President: నూతనంగా ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్ మాతృమూర్తి జానకీ అమ్మాల్ తన కుమారుడి ఎన్నికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఎన్నికపై ఆమె హర్షం వ్యక్తంచేశారు. నాకు చాలా సంతోషంగా ఉన్నదని ఆమె వ్యాఖ్యానించారు. ఆమె ఈ సందర్భంగా రాధాకృష్ణన్ పుట్టిననాటి విషయాలను గుర్తు చేసుకుంటూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని కలిగించాయి. తమ ఇంట్లో ఆనాడు అనుకున్న విషయాలు నేడు నిజమయ్యాయయని చెప్పుకుని మురిసిపోయారు.
Vice President: నాకు కొడుకు పుట్టిన సమయంలో దేశ రాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉన్నారు. ఆయనలాగే నేను కూడా ఉపాధ్యాయురాలిగా ఆనాడు పనిచేశాను. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని నా కుమారుడికి సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు పెట్టుకున్నా. అదే సమయంలో తన భర్త ఓ మాట అన్నాడు. ఏదో ఒకరోజు తను ప్రెసిడెంట్ కావాలనే ఆ పేరు పెడుతున్నావా అని నా భర్త అడిగారు. 62 ఏళ్ల తర్వాత అదే నిజమైంది… అని జానకీ అమ్మాల్ ఆనాటి జ్ఞాపకాన్ని నెమరు వేసుకున్నారు.
Vice President: సాధారణంగా రాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను ఆదర్శంగా తీసుకున్న జానకీ అమ్మాల్ తన కుమారుడికి పేరు పెట్టుకోవడం, ఆయన కూడా ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావడం యాదృచ్చికంగా జరిగినా, ఆయన తల్లికి మాత్రం అద్భుతంగా భావిస్తూ ఆమె పై వ్యాఖ్యలు చేశారు. సీపీ రాధాకృష్ణన్ పుట్టిన నాడే ఆయన తల్లిదండ్రులు అనుకున్న మాటలు నేడు నిజమవడం మిరాకిల్ అని పలువురు భావిస్తున్నారు.
Vice President: భారత నూతన ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ తన ప్రత్యర్థి జస్టిస్ బీ సుదర్శన్‌రెడ్డిపై గెలుపొందారు. సీపీ రాధాకృష్ణన్ ఎన్డీయే తరఫున పోటీ చేయగా, సుదర్శన్‌రెడ్డి ఇండియా కూటమి తరఫున పోటీపడ్డారు. మొత్తం 781 మంది సభ్యులకు ఓట్లు ఉండగా, 767 మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఓట్లలో 15 ఓట్లు పోలవలేదు. రాధాకృష్ణన్ కు 452 ఓట్లు పోలవగా, సుదర్శన్‌రెడ్డికి 300 మొదటి ప్రాధాన్య ఓట్లు పోలయ్యాయి. దీంతో 152 ఓట్లతో రాధాకృష్ణన్ గెలుపొంది 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.