Vice President Election: సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి పదవికి జరగనున్న ఎన్నికలకు ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ ఇటీవల రాజీనామా చేయడంతో ఈ ఎన్నికలు అనివార్యమయ్యాయి.
ఆగస్టు 21నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ, ఆగస్టు 22న నామినేషన్ల పరిశీలన ఉంటుంది, ఆగస్టు 25 నామినేషన్ల ఉపసంహరణ,సెప్టెంబర్ 9పోలింగ్ నిర్వహించి అదే రోజున ఓట్ల లెక్కింపు చేపడుతారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 66 ప్రకారం, ఉపరాష్ట్రపతి ఎన్నికలలో పార్లమెంటులోని లోక్‌సభ మరియు రాజ్యసభ సభ్యులు మాత్రమే ఓటు వేస్తారు. రాష్ట్రాల శాసనసభ సభ్యులకు ఈ ఎన్నికలో ఓటు హక్కు ఉండదు.
ఇది కూడా చదవండి: Helicopter Crash: కుప్పకూలిన హెలికాప్టర్.. ఇద్దరు మంత్రులు మృతి
ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేయడానికి భారత రాజ్యాంగం ప్రకారం అభ్యర్థి తప్పనిసరిగా భారత పౌరుడై ఉండాలి. అభ్యర్థి వయస్సు 35 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడానికి అవసరమైన అన్ని అర్హతలను కలిగి ఉండాలి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం లేదా స్థానిక సంస్థల ఆధీనంలోని ఏ విధమైన లాభదాయక పదవిలోనూ ఉండకూడదు. ఈ అర్హతలు ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలో ముఖ్యమైనవి. అభ్యర్థి నామినేషన్ పత్రాలను దాఖలు చేసేటప్పుడు ఈ అర్హతలన్నీ కలిగి ఉన్నట్లు రుజువు చేయాలి.
