Vice president Election 2025: అందరూ ఊహించనట్టే ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో ఆ ఇద్దరే మిగిలారు. ఎన్నికల నామినేషన్ల గడువు ముగియడంతో జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, సీపీ రాధాకృష్ణన్ మాత్రమే పోటీలో నిలిచారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి అధికారిక ప్రకటనను విడుదల చేశారు. దీంతో ఎన్డీయే పక్షాల తరఫున రాధాకృష్ణన్, ఇండియా కూటమి తరఫున జస్టిస్ సుదర్శన్‌రెడ్డి పోటీలో నిలిచారు.
Vice president Election 2025: ఈ మేరకు వచ్చే నెల (సెప్టెంబర్ 9న) ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ జరుగుతుంది. అదేరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ను నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. ఆ ఓట్ల లెక్కింపు పూర్తవగానే ఫలితాన్ని ప్రకటించనున్నారు. జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, సీపీ రాధాకృష్ణన్ ఇద్దరిలో ఎవరు గెలుస్తారో వేచి చూద్దాం మరి.