Veturi: అలా అలా నడుచుకుంటూ పోతూనే అలవోకగా పాటలు పలికించేవారు వేటూరి. ఇక ట్యూన్స్ ఇచ్చి రాయమన్నా, క్షణాల్లో కవిత కట్టి తనదైన పదవిన్యాసాలతో అలరించేవారు. పండితపామరులను అలరిస్తూ సాగిన వేటూరి పాటలు తెలుగువారిని విశేషంగా ఆకట్టుకున్నాయి. సగటు సినీ అభిమానుల మదిలో చిందులు వేసే పాటలు రాశారు; అలాగే పండితులను ఆలోచింప చేసే గీతాలనూ అందించారు. ఒకానొక దశలో ఆ నాటి మేటి హీరోలందరి చిత్రాలూ వేటూరి పాటలతోనే విజయతీరాలు చేరుకున్నాయి.
తన ముందుతరం కవులను ఆదర్శంగా తీసుకుని వేటూరి తన సాహితీసేద్యం చేశారు. నటరత్న యన్టీఆర్, కళాతపస్వి కె.విశ్వనాథ్ ప్రోత్సాహంతో వేటూరి తెలుగు చిత్రసీమలో జైత్రయాత్ర చేశారు. అప్పటి వర్ధమాన కథానాయకుల చిత్రాలకు వేటూరి పాటలు ప్రాణం పోసి, వారికి విజయాలను అందించాయి. తెలుగు జనం ఏ నాటికీ మరచిపోలేని మధురం పంచుతూ సాగారు వేటూరి. జనవరి 29న వేటూరి జయంతి. ఈ సందర్భంగా వేటూరి మరపురాని పాటలను మననం చేసుకోవడం అభిమానులకు ఓ సంప్రదాయంగా మారింది.
శంకరాభరణం’లోని “ఓంకార నాదాను…” సాంగ్