Vettaiyan OTT: రజనీకాంత్, అమితాబ్ కాంబోలో వచ్చిన చిత్రం ‘వేట్టయన్’. అక్టోబర్ 10న ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ తమిళ స్టారర్ థియేటర్ ఆడియన్స్ ను అంతగా ఆకట్టుకోలేక పోయింది. టిజె జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పాహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, దుసారా విజయన్, మంజువారియర్, రితికాసింగ్ ఇతర ముఖ్య పాత్రధారులు. అనిరుద్ రవిచందర్ సంగీతం అందించిన ఈ మూవీ దాదాపు 300 కోట్లతో తెరకెక్కగా బాక్సాఫీస్ వద్ద 220 కోట్లనే వసూలు చేయగలిగింది. తెలుగులో అయితే డిజాస్టర్ అయింది. ఇదిలా ఉంటే ఈ సినిమా దీపావళి ముగియగానే నవంబర్ 7వ తేదీన ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీ రైట్స్ ను 90 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ప్రథమార్ధం పర్వాలేదనిపించినా ద్వితీయార్ధం సాగతీతగా ఉండటం సినిమాకు పెద్ద మైనస్. మరి ఓటీటీలో అయినా సెకండ్ హాఫ్ ను కుదిస్తారా అన్నది చూడాల్సి ఉంది. మరి థియేటర్లలో నిరాశపరిచిన ‘వేట్టైయాన్’ ఓటీటీలో అయినా ఆకట్టుకుంటుందేమో చూడాలి.
