Patnam Narender Reddy: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ కొనసాగింది. వాదనల అనంతరం తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. లగచర్ల ఘటనలో ఆయనను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుపై బుధవారం హైకోర్టులో వాదప్రతివాదాలు హాట్‌హాట్‌గా కొనసాగాయి. నరేందర్‌రెడ్డి అరెస్టు సమయంలో పోలీసులు నిబంధనలు పాటించలేదని, పార్కులో వాకింగ్ చేస్తుండగా, వారి కుటుంబానికి కనీసం సమాచారం ఇవ్వలేదని నరేందర్‌రెడ్డి తరఫు లాయర్లు వాదించారు.
Patnam Narender Reddy: పట్నం నరేందర్‌రెడ్డిని పార్కులో కాదని, ఆయన ఇంటి వద్ద అరెస్టు చేశామని ప్రభుత్వ తరఫు లాయర్ వాదించారు. ఇరువాదనలు విన్న హైకోర్టు పలు ప్రశ్నలను సధించింది. ఘటన జరిగిన రోజు లగచర్ల ఘటనలో మరో నిందితుడైన సురేశ్.. పట్నం నరేందర్‌రెడ్డికి ఎన్నిసార్లు ఫోన్ కాల్ చేశారని హైకోర్టు ప్రశ్నించింది. కాల్స్ ఆధారంగా ఒక వ్యక్తిని అరెస్టు చేస్తారా? అని మరో ప్రశ్నను సంధించింది. అనంతరం తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.
Patnam Narender Reddy: ఇప్పటికే పట్నం నరేందర్‌రెడ్డికి ప్రత్యేక బ్యారక్‌ను కేటాయించాలని, తన ఇంటి నుంచి వచ్చే భోజనాన్ని తీసుకునేందుకు అనుమతించాలని హైకోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. దీంతో నరేందర్‌రెడ్డికి కొంత ఊరట లభించింది. మరో పిటిషన్‌లో ఈ రోజు జరిగిన విచారణపై నరేందర్‌రెడ్డి లాయర్లు తమ వాదనలను గట్టిగా వినిపించామని, బెయిల్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.