Harish Shankar: టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాడు. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను ఆకట్టుకుని, వెంకీ కెరీర్‌లోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
ఈ విజయంతో ఉత్సాహంగా ఉన్న వెంకటేష్ తన తదుపరి చిత్రం కోసం సన్నాహాలు చేస్తున్నాడు. పలువురు దర్శకుల నుంచి కథలు వింటున్న ఆయనకు క్రేజీ డైరెక్టర్ హరీష్ శంకర్ ఓ కథ వినిపించగా, అది వెంకీకి నచ్చినట్లు తెలుస్తోంది. నిర్మాత సురేష్ బాబు కూడా ఈ కథకు ఆమోదం తెలిపినట్లు సమాచారం.
Also Read : Sampoornesh Babu: ఏప్రిల్ 11న సంపూర్ణేష్ బాబు ‘సోదరా’ రిలీజ్!
Harish Shankar: దీంతో ఈ ప్రాజెక్ట్‌ను వెంకటేష్ లాక్ చేసినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వెంకీ కెరీర్‌లో 77వ చిత్రంగా రూపొందనున్న ఈ మూవీని త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ విజయంతో జోష్‌లో ఉన్న వెంకీ, హరీష్ శంకర్‌తో కలిసి మరో హిట్ కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు.