venkatesh : వెంకీకి జోడీగా కీర్తిసురేశ్ .. నిర్మాతగా నితిన్!

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ కు ఉన్న క్రేజే వేరు. ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కూడా వేగంగా సాగుతోంది. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా చేస్తున్నారు. అయితే తాజా అప్డేట్స్ ప్రకారం వెంకటేష్ ఓ తమిళ డైరెక్టర్ తో ఓ సినిమా చేయబోతున్నాడని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

టీఎన్. సంతోష్ డైరెక్షన్ లో త్వరలోనే ఓ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కథతో మూవీ తెరకెక్కబోతోంది. వెంకటేష్ కు స్టోరీని వినిపించడంతో ఆయన ఓకే చెప్పినట్టు సమాచారం. . ఇది ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లరట. వెంకీ పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నాడు అంటున్నారు. అయితే ఈ సినిమాలో యంగ్ బ్యూటీ కీర్తి సురేష్ హీరోయిన్ గా చేయబోతోందట. ఈ మేరకు మూవీ టీం ఆమెను సంప్రదించగా ఆమె కూడా ఓకే చేశారట.

అయితే ఈ సినిమా కథ నచ్చిన యంగ్ హీరో నితిన్ తన సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ పై మూవీని నిర్మించేందుకు సిద్ధమయ్యాడట. మరి చూడాలి ఈసినిమాపై అప్డేట్స్ ఏంటో? మరో వైపు.. హీరో నితిన్ మూడు సినిమాలను అనౌన్స్ చేసాడు. ఆ సినిమాలను త్వరగా పూర్తి చేయబోతున్నారు. ఇందులో రాబిన్ హుడ్ సినిమాపై నితీన్ ఆశలు పెట్టుకున్నారు. ఆ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుంది . ఈ మూవీ డిసెంబర్ 20 న విడుదల కాబోతుంది. మరీ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. ఈ సినిమా హిట్ పైనే మిగిలిన సినిమాలు ఫలితాలు ఆధారపడ్డాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  A virus that infects dogs: కుక్క‌ల‌తో పిల్ల‌లు ఆడుకుంటున్నారా? త‌స్మాత్ జాగ్ర‌త్త‌!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *