Venkaiah naidu: జమిలి సమయం, ధనం ఆదా చేస్తాయి 

Venkaiah naidu: జమిలి (ఏకకాల) ఎన్నికలపై తిరుపతిలో మేధావుల సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎన్నికల సంస్కరణల అవసరాన్ని గుర్తుచేస్తూ, జమిలి ఎన్నికల నిర్వహణ వల్ల సమయం, ఖర్చు రెండు ఆదా అవుతాయని ఆయన అన్నారు.

ప్రస్తుతం దేశంలో తరచుగా ఎన్నికలు జరుగుతున్నాయనీ, వాటి వల్ల అభివృద్ధి పనులకు అంతరాయం కలుగుతోందని ఆయన పేర్కొన్నారు. జమిలి ఎన్నికలు నిర్వహిస్తే పరిపాలనకు స్థిరత లభించి, పరిపాలనా వ్యవస్థ మెరుగవుతుందన్నారు.

అయితే కొన్ని రాజకీయ పార్టీలు స్వార్థ ప్రయోజనాల దృష్ట్యా జమిలి ఎన్నికలకి వ్యతిరేకంగా నిలుస్తున్నాయన్నారు. “ప్రాంతీయ పార్టీలకు నష్టం జరుగుతుందనే వాదనలో వాస్తవం లేదు,” అని స్పష్టంచేశారు. అన్ని పార్టీలూ దీన్ని విపులంగా చర్చించి, దేశానికి మేలు చేసే దిశగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

జమిలి ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని కోరుతూ, ప్రజలలో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *