Vemuru Ravikumar: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ప్రవాస ఆంధ్రుల సంక్షేమం, రాష్ట్రంలో పెట్టుబడుల ప్రోత్సాహం వంటి కీలక విషయాలను చూసే ‘ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ’ (APNRT సొసైటీ)కి కొత్త అధ్యక్షుడిని నియమించింది.
ఈ కీలక పదవికి డాక్టర్ వేమూరు రవికుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ప్రస్తుతం ఎన్నారై టీడీపీ సెల్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇకపై ఆయన ప్రవాసాంధ్ర తెలుగు వ్యవహారాలకు సంబంధించి ప్రభుత్వ సలహాదారుగా కూడా పనిచేస్తారు. అలాగే, APNRT సొసైటీకి అధ్యక్షుడిగా కూడా కొనసాగుతారు.
Also Read: Cognizant: ఐటీ దిగ్గజ సంస్థ: కాగ్నిజెంట్ క్యాంపస్ విశాఖలో
Vemuru Ravikumar: ఈ నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని జూన్ 25, 2025న సాధారణ పరిపాలనా శాఖ (GAD) ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ జారీ చేసిన జీ.ఓ.ఆర్.టి. నెం.1228లో స్పష్టం చేశారు. డాక్టర్ రవికుమార్ వేమూరు గతంలో కూడా APNRT సొసైటీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన నియామకంతో ప్రవాసాంధ్రుల సమస్యలు మరింత వేగంగా పరిష్కారమవుతాయని, రాష్ట్రానికి పెట్టుబడులు కూడా పెరుగుతాయని ఆశిస్తున్నారు.

