Vemulavada: ప్రతిఏటా ఫాల్గుణ మాసంలో వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో మార్చి 17న సోమవారం శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవం జరుగుతుంది. అంగరంగ వైభవంగా కమనీయంగా కల్యాణం నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లను ఘనంగా చేశారు. ఈ కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు.
Vemulavada: తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్‌కు 160 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కరీంగనర్ జిల్లా కేంద్రానికి 36 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ క్షేత్రంం పౌరాణికంగా, చారిత్రకంగా పలు విశిష్టతలను కలిగి ఉన్నది.
Vemulavada: మార్చి 17న ఉదయం స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకంతో కల్యాణ ఘట్టం ప్రారంభమవుతుంది. ఈ కల్యాణానికి ముందు ఎదుర్కోలు కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహిస్తారు. వేదమంత్రాలు, మేళతాళాల మధ్య సందడిగా ఈ కార్య్రమాన్ని నిర్వహిస్తారు.
Vemulavada: వేములవాడ రాజరాజేశ్వరాలయంలో కోడె మొక్కులకు విశిష్ట ప్రాధాన్యం ఉన్నది. సంతానం కోసం, పిల్లల విద్యాభ్యాసం కోసం, ఉద్యోగాలు రావాలని కోరుకుంటూ శివుడికి భక్తి శ్రద్ధలతో భక్తులు పెద్ద ఎత్తున కోడె మొక్కులు చెల్లించుకుంటారు. తమ ఇంటి నుంచి తెచ్చిన కోడెలను ఈ ఆలయం వద్ద వదిలేసి దేవుడికి సమర్పించుకుంటారు. పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించడంతో పాటు భక్తులు పెద్ద ఎత్తున తలనీలాలను సమర్పించుకుంటారు.