Veerasimha Reddy: నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, బాలయ్య తదుపరి ప్రాజెక్ట్‌పై ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ‘వీర సింహా రెడ్డి’ వంటి సూపర్ హిట్ అందించిన దర్శకుడు గోపీచంద్ మలినేనితో బాలయ్య తన నెక్స్ట్ చిత్రం చేయనున్నట్లు స్వయంగా గోపీచంద్ వెల్లడించారు.
Also Read: HIT 3: హిట్ 3 ప్రమోషన్స్.. వెరీ డిఫరెంట్!
Veerasimha Reddy: బాలీవుడ్ హంగామాతో మాట్లాడిన గోపీచంద్, తాజా సక్సెస్‌తో ఉత్సాహంగా ఉన్న తాను బాలయ్యతో వెంటనే మరో సినిమా చేయనున్నట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని బాలయ్య పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న అధికారికంగా ప్రకటించనున్నట్లు వెల్లడించారు. బాలయ్య ఫ్యాన్స్‌లో ఈ వార్త హర్షం నింపుతోంది. మరోసారి తన హిట్ దర్శకుడితో బాలయ్య సందడి చేయనున్నారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త ప్రాజెక్ట్ కూడా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
వీర సింహ రెడ్డి – జై బాలయ్య మాస్ వీడియో సాంగ్ :