Retirement: భారత మహిళా క్రికెటర్ వేద కృష్ణమూర్తి అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. 32 ఏళ్ల వేద కృష్ణమూర్తి తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఆమె తన సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. 2011లో 18 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశారు. దాదాపు తొమ్మిదేళ్ల పాటు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.
48 వన్డేలు, 76 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. వన్డేలలో 829 పరుగులు, టీ20లలో 875 పరుగులు సాధించారు. 2017 వన్డే ప్రపంచ కప్ మరియు 2020 టీ20 ప్రపంచ కప్‌లలో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టులో ఆమె సభ్యురాలు. 2020 టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌లో జరిగిన మ్యాచ్ ఆమెకు చివరి అంతర్జాతీయ మ్యాచ్. వేద కృష్ణమూర్తి దూకుడైన మిడిలార్డర్ బ్యాటర్‌గా, చురుకైన ఫీల్డర్‌గా పేరు పొందారు.
ఇది కూడా చదవండి: UPI New Rules: ఆటో పే ఆ టైం లో పనిచేయదు.. ఆగస్టు 1 నుంచి UPI కొత్త రూల్స్
ఇటీవల కర్ణాటక మాజీ క్రికెటర్ అర్జున్ హొయసలను వివాహం చేసుకున్నారు. 2021లో కోవిడ్ కారణంగా ఆమె తల్లి, సోదరిని కోల్పోయి వ్యక్తిగతంగా తీవ్ర విషాదాన్ని ఎదుర్కొన్నారు. తన రిటైర్మెంట్ ప్రకటనలో, వేద కృష్ణమూర్తి ఒక చిన్న పట్టణం నుండి వచ్చి భారత జెర్సీని ధరించడం తనకెంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు. క్రికెట్ తనకు ఎన్నో పాఠాలు, స్నేహాలు, జ్ఞాపకాలను ఇచ్చిందని, ఈ ప్రయాణానికి కృతజ్ఞతగా వీడ్కోలు పలుకుతున్నానని, అయితే ఆట నుండి పూర్తిగా దూరంగా ఉండబోనని తెలిపారు.

