VC Sajjanar

VC Sajjanar: నెక్స్ట్ జైలుకు పల్లవి ప్రశాంత్.. బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌పై కఠిన చర్యలు తప్పవంటున్న సజ్జనార్

VC Sajjanar: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. డబ్బు కోసం వీటిని ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని, యూట్యూబర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లను సోషల్ మీడియా వేదికగా ఎండగడుతున్నారు.

ఈ క్రమంలో, ఇప్పటికే ప్రముఖ తెలుగు యూట్యూబర్లు భయ్యా సన్నీ యాదవ్, హర్ష సాయి తదితరులపై సైబరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. దీనితో, మరికొందరు సెలబ్రిటీలు భయంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమ సోషల్ మీడియా ఖాతాలను డిలీట్ చేసుకుంటున్నారు. సినీ నటీమణులు సురేఖ వాణి, సుప్రిత, రీతౌ చౌదరి లాంటి వారు తమ తప్పును అర్థం చేసుకుని, క్షమాపణలు చెబుతూ వీడియోలు విడుదల చేశారు.

Also Read: NATS: అమెరికా తెలుగు సంబరాలకు రండి తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

VC Sajjanar:  ఇదిలా ఉండగా, బిగ్ బాస్ టైటిల్ విన్నర్, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కూడా బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌లో పాల్గొన్నట్లు సమాచారం. గతంలో క్రికెట్ ప్రెడిక్షన్ యాప్‌ను అతను బాగా ప్రచారం చేశారని తెలుస్తోంది. ఈ ప్రకటనల కోసం అతనికి భారీగా డబ్బులు అందినట్లు సమాచారం. ప్రముఖ టూరిస్ట్ వ్లోగర్ అన్వేష్ ఇటీవల ఈ విషయాన్ని బయటపెట్టాడు. పల్లవి ప్రశాంత్ చేసిన బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేశాడు. దీంతో, అతని మీద కూడా పోలీసులు త్వరలో కేసు నమోదు చేసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.

ఈ చర్యల నేపథ్యంలో, సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసే వారిపై మరింత నిఘా ఉంచనున్నట్లు పోలీసులు వెల్లడించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *