Vash Level 2: గుజరాతీ సినీ పరిశ్రమలో మరో కొత్త చరిత్ర రాసుకుంది ‘వశ్ లెవల్ 2’. థియేటర్లలో విజయం సాధించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను రూ.3.5 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు ఏ గుజరాతీ సినిమాకీ ఇంత పెద్ద రేటుతో ఒప్పందం జరగడం ఇదే మొదటిసారి కావడంతో పరిశ్రమ అంతా ఈ డీల్‌పై చర్చ సాగుతోంది.
ఈ సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్ చిత్రాన్ని కృష్ణదేవ్ యాజ్ఞిక్ దర్శకత్వం వహించారు. 2023లో వచ్చిన ‘వశ్’ చిత్రానికి ఇది సీక్వెల్. ఆగస్టు 27న గుజరాతీ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రూ.8 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమై, థియేటర్లలో రూ.18 కోట్ల వసూళ్లు సాధించింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబర్ 22 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.
Also Read: Mumbai: సుశాంత్ మరణం.. ఆత్మహత్య కాదు, హత్యే!
గర్ల్స్ హైస్కూల్ నేపథ్యంలో సాగే ఈ కథలో, కొంతమంది విద్యార్థినులు ఆత్మహత్య చేసుకోవడం వెనుక ఉన్న మిస్టరీ చుట్టూ కథ తిరుగుతుంది. ఇందులోని సస్పెన్స్, సైకలాజికల్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తెలుగు నటి, బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ మోనాల్ గజ్జర్ ఇందులో కీలక పాత్రలో కనిపించారు.
సినిమా కథ, సస్పెన్స్ ట్రీట్మెంట్, టెక్నికల్ వర్క్ కారణంగా ‘వశ్ లెవల్ 2’ దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. గుజరాతీ సినిమాకు ఇంతటి ప్రజాదరణ రావడం ఇదే తొలిసారి. ప్రేక్షకులు ఈ సినిమాపై సోషల్ మీడియాలో భారీగా స్పందిస్తున్నారు. అందుకే ప్రస్తుతం ఈ సినిమా ట్రెండింగ్‌లో నిలిచింది. గుజరాతీ సినీ రంగానికి ఇది ఓ కొత్త మైలురాయిగా మారింది.

