Varun Tej: మెగా ఫ్యామిలీ హీరోలకు ఆంజనేయ స్వామి అంటే పరమ భక్తి. అయ్యప్ప మాలతో పాటు ఏ మాత్రం అవకాశం ఉన్నీ మెగా ఫ్యామిలీ హీరోలు ఆంజనేయ స్వామి మాల కూడా ధరిస్తూ ఉంటారు. తాజాగా నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హనుమాన్ మాల వేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించారు. గత కొంత కాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నాడు వరుణ్ తేజ్. అతని తాజా చిత్రం ‘మట్కా’ సైతం తీవ్ర నిరాశకు గురిచేసింది. దాంతో ఇప్పటికే వరుణ్ తేజ్ కమిట్ అయిన రెండు సినిమాల పరిస్థితిపై నీలి నీడలు ముసురుకున్నాయి. అయితే అందులో ఓ సినిమా మార్చిలో సెట్స్ పైకి వెళుతున్నట్టు అధికారిక ప్రకటన వెలువడింది. వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ సినిమాను యువీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. మరి ఈ చిత్రంతో అయిన తిరిగి వరుణ్ తేజ్ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.
