Varun Tej: మెగా హీరో వరుణ్ తేజ్ త్వరలో తండ్రి కాబోతున్నాడు. 2023 నవంబరులో తన ప్రేయసి, నటి లావణ్య త్రిపాఠిని వివాహం చేసుకున్న వరుణ్, ఈ ఏడాది మే నెలలో తాము తల్లిదండ్రులు కాబోతున్నామని అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత నుంచి ఈ జంట తమ జీవితం ప్రతి క్షణాన్ని ఆనందంగా గడుపుతున్నారు.
బిడ్డ కోసం ప్రత్యేక షాపింగ్
పుట్టబోయే బిడ్డ కోసం వరుణ్ తేజ్ ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలుపెట్టేశాడు. లావణ్య సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో వరుణ్ తేజ్ చిన్నారికి ఏ బెడ్‌షీట్ బాగుంటుందో ఆలోచిస్తూ కన్ఫ్యూజ్ అవుతున్నాడు. దీనిపై లావణ్య, “మై రియల్ బంగారం” అంటూ క్యూట్ కామెంట్ పెట్టింది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు, “ఇప్పటికే మంచి తండ్రి బాధ్యతలు తీసుకుంటున్నాడు”, “ఎంత బిజీగా ఉన్నా బిడ్డ కోసం స్వయంగా షాపింగ్ చేయడం గర్వకారణం” అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
లవ్ స్టోరీ నుంచి పేరెంట్స్ జర్నీ వరకు
ఆరేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట చివరికి పెద్దలను ఒప్పించి 2023లో పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి వరుణ్, లావణ్య ప్రెగ్నెన్సీ ప్రకటించిన తర్వాత ఎక్కువగా కలిసి టైం స్పెండ్ చేస్తున్నారు. షూటింగ్స్ మధ్యలో సమయం దొరికినప్పుడల్లా టూర్స్‌కు వెళ్లి ఆ క్షణాలను ఎంజాయ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Tirumala: తృటిలో తప్పిన ప్రమాదం.. బైక్ పై దూకిన చిరుత..
వరుణ్ తేజ్ సినిమాల జర్నీ
‘ముకుంద’తో హీరోగా పరిచయం అయిన వరుణ్ తేజ్, ఫిదా, కంచె వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎఫ్ 2, ఎఫ్ 3 వంటి కామెడీ ఎంటర్‌టైనర్లతో సూపర్ హిట్స్ సాధించాడు. అయితే ఇటీవల విడుదలైన మట్కా మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఓ హారర్ కామెడీ చిత్రంలో నటిస్తున్నాడు.
మరో నెలలో గుడ్ న్యూస్?
బేబీ కోసం ఇలా షాపింగ్ చేస్తూ, ప్లానింగ్ చేస్తూ ఉండటం చూస్తుంటే, మరో నెల రోజుల్లో ఈ జంట నుంచి గుడ్ న్యూస్ రాబోతుందనే అంచనాలు అభిమానుల్లో నెలకొన్నాయి.