One Way Ticket: డిఫరెంట్ ప్రాజెక్ట్‌లతో, విభిన్నమైన కంటెంట్‌తో వరుణ్ సందేశ్ నిత్యం ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం వరుణ్ సందేశ్ హీరోగా ‘వన్ వే టికెట్’ అనే కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. శ్రీ పద్మ ఫిల్మ్స్, రంగస్థలం మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ మూవీని జొరిగే శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఏ. పళని స్వామి దర్శకత్వం వహిస్తున్నారు.
వరుణ్ సందేశ్, కుష్బూ చౌదరి హీరో హీరోయిన్లుగా తెరకెక్కనున్న ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఆదివారం (జూలై 27) నాడు ఘనంగా జరిగాయి. ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్న ప్రముఖ నిర్మాతలు సి. కళ్యాణ్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, హర్షిత్ రెడ్డి స్క్రిప్ట్ అందజేశారు. దర్శక, నిర్మాత త్రినాధరావు నక్కిన తొలి సన్నివేశానికి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
ఈ చిత్రంలో మనోజ్ నందన్, సుధాకర్ వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించనున్నారు. ఈ మూవీకి కెమెరామెన్‌గా శ్రీనివాస్ బెజుగమ్, సంగీత దర్శకుడిగా కార్తిక్ పని చేయనున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించారు. త్వరలోనే చిత్రానికి సంబంధించిన ఇతర విషయాల్ని ప్రకటించనున్నారు.
నటీనటులు : వరుణ్ సందేశ్, కుష్బూ చౌదరి, మనోజ్ నందన్, సుధాకర్ తదితరులు
సాంకేతిక బృందం
బ్యానర్: శ్రీ పద్మ ఫిల్మ్స్, రంగస్థలం మూవీ మేకర్స్
నిర్మాత: జొరిగే శ్రీనివాసరావు
దర్శకుడు: ఏ. పళని స్వామి
కెమెరామెన్: శ్రీనివాస్ బెజుగమ్
సంగీత దర్శకుడు : కార్తిక్
పీఆర్వో : సాయి సతీష్