Saraswathi

Saraswathi: దర్శకురాలిగా వరలక్ష్మి శరత్‌కుమార్ సినిమా పూర్తి!

Saraswathi: నటి వరలక్ష్మి శరత్‌కుమార్ మొదటిసారి దర్శకురాలిగా, నిర్మాతగా మారి చేసిన చిత్రం సరస్వతి. ఈ హై కాన్సెప్ట్ థ్రిల్లర్ షూటింగ్ పూర్తయింది. త్వరలో ప్రమోషనల్ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఈ సినిమా వరలక్ష్మి కెరీర్‌లో ప్రత్యేకమని ఆమె తెలిపారు. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు చూద్దాం.

Also Read: Dheekshith Shetty: ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్లో సరికొత్త లేయర్స్ ఉన్న చిత్రం సఃకుటుంబానాం

నటి వరలక్ష్మి శరత్‌కుమార్ లీడ్ రోల్‌లో నటిస్తూ, మొదటిసారి దర్శకత్వం వహిస్తూ, సోదరి పూజా శరత్‌కుమార్‌తో కలిసి నిర్మిస్తున్న చిత్రం సరస్వతి. హై కాన్సెప్ట్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న, ఈ చిత్రం షూటింగ్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా వరలక్ష్మి మాట్లాడుతూ, సహకరించిన కళాకారులు, సాంకేతిక నిపుణులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నటిగానే కాకుండా దర్శకురాలు, నిర్మాతగా వ్యవహరించడంతో ఈ చిత్రం తన కెరీర్‌లో చాలా ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. త్వరలోనే చిత్ర ప్రమోషనల్ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చెప్పారు. ఈ చిత్రంలో జీవా, ప్రకాష్ రాజ్, నాజర్, ప్రియమణి, రాధిక, రావు రమేష్, సప్తగిరి, తులసి, దేవీ ప్రసాద్ వంటి ప్రముఖులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. మరి ఈ చిత్రంతో వరలక్ష్మి ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *