Varalakshmi Vratam

Varalakshmi Vratam: నేడు వరలక్ష్మి వ్రతం.. చుక్కలు చూపిస్తున్న పండ్లు, పూల- ధరలు!

Varalakshmi Vratam: నేడు వరలక్ష్మీ వ్రతం కావడంతో పండ్లు, పూల-కు మార్కెట్‌లో డిమాండ్ బాగా పెరిగింది, దీంతో ధరలు కూడా అదే స్థాయిలో పెరిగాయి.గులాబీలు, చామంతి, బంతి, మల్లెపూల ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా మల్లెపూలు కిలో రూ.1,000 నుంచి రూ.1,500 వరకు కూడా చేరినట్లు నివేదికలు ఉన్నాయి. గులాబీలు, బంతిపూలు సాధారణ ధరల కంటే రెట్టింపు లేదా అంతకంటే ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. రటిపండ్లు, ఆపిల్, దానిమ్మ, బత్తాయి వంటి వాటి ధరలు కూడా పెరుగుతాయి. అరటిపండ్లు డజను రూ.100 నుంచి రూ.120 వరకు అమ్ముడవుతున్నాయి. విజయవాడ హోల్‌సేల్ మార్కెట్‌లో పూల ధరలు ఆకాశాన్నంటాయి. బంతిపూలు: కిలో రూ.300 చామంతి, గులాబీలు: కిలో రూ.600 మల్లెలు, కనకాంబరాలు, జాజులు: కిలో రూ.1200 వరకు కలువ పువ్వు: ఒక్కొక్కటి రూ.50 అమ్ముతున్నారు. అరటిపండ్లు డజను రూ.100 నుండి రూ.120 వరకు అమ్ముడయ్యాయి. విశాఖపట్నంలో కూడా పూల ధరలు విపరీతంగా పెరిగాయి. బంతి పూలు: కిలో రూ.100 వరకు చామంతి, గులాబీలు: కిలో రూ.400 వరకు జాజిపూలు: కిలో రూ.1500 పైనే ధర పలికింది.

Also Read: Turmeric Side Effects: యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉన్నాయని పసుపును అతిగా వాడేస్తున్నారా..? ఐతే జాగ్రత్త

ఇక హైదరాబాద్‌లో కూడా పూల ధరలు పెరిగాయి. ప్రధానంగా బంతి, చామంతి, గులాబీ పూలకు డిమాండ్ ఎక్కువ ఉంది. మల్లెపూలు, కనకాంబరాల ధరలు కూడా భారీగా పెరిగాయి. వరంగల్ లో కూడా పూజకు కావాల్సిన పూలు, పండ్లు, తమలపాకులు, సుగంధ ద్రవ్యాల కొనుగోళ్లతో మార్కెట్లు రద్దీగా ఉన్నాయి, ధరలు కూడా పెరిగాయి. ఇతర రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల నుండి పూలు దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఇతర ప్రాంతాల నుండి పూలను తీసుకురావడానికి అయ్యే రవాణా ఖర్చుల వల్ల ధరలు మరింత పెరుగుతాయని వ్యాపారులు అంటున్నారు. శ్రావణ మాసంలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు ఎక్కువగా ఉండటం కూడా ధరలు పెరగడానికి మరో కారణమని అంటున్నారు. అయితే మరికొద్దీ రోజుల్లో ధరలు తగ్గుముఖం పడతాయని చెబుతున్నారు. సాధారణంగా పండుగల సీజన్‌లో ధరలు పెరగడం చూస్తుంటాం. కానీ ఈ ఏడాది ధరలు గతంతో పోలిస్తే మరింత అధికంగా ఉన్నాయని కొనుగోలుదారులు చెబుతున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *