Aamir Khan: బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్ ఖాన్ లైనప్‌లో టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూడా చేరారు. వంశీ చెప్పిన కథకు అమీర్ నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. అమీర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందన్నది ఇంకా సస్పెన్స్‌లో ఉంది. అటు, భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్‌లో అమీర్ నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
అమీర్ ఖాన్ లైనప్‌లో మొత్తం నాలుగు చిత్రాలు ఉన్నట్లు సమాచారం. వీటిలో ముందుగా ఏ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందన్నది అమీర్ నిర్ణయంపై ఆధారపడి ఉంది. వంశీ ప్రాజెక్ట్‌కు టోకెన్ నంబర్ ఎప్పుడు వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇక, త్వరలో విడుదల కానున్న ‘కూలీ’ చిత్రంలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి అమీర్ ప్రేక్షకులను అలరించనున్నారు. అమీర్ ఖాన్ నెక్స్ట్ మూవ్ ఏంటన్నది సినీ అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది.