Bharta Mahashayulaku Vignapti

Bharta Mahashayulaku Vignapti: దుమ్మురేపుతున్న ‘వామ్మో వాయ్యో’ మాస్ గీతం!

Bharta Mahashayulaku Vignapti: మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి ‘వామ్మో వాయ్యో’ అనే జానపద పాటను విడుదల చేశారు. రవితేజతో పాటు ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి స్టెప్పులు ఆకర్షిస్తున్నాయి.

Also Read: Bhagyashri Borse: అఖిల్ లెనిన్.. ‘భారతి’గా భాగ్యశ్రీ బోర్సే

రవితేజ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి కిశోర్ తిరుమల దర్శకత్వం వహించగా, సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్, తెలుగు బ్యూటీ డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం, ఈనెల 13న విడుదల కానుంది. సంక్రాంతి బరిలో నిలిచే ఈ సినిమా నుంచి తాజాగా ‘వామ్మో వాయ్యో’ పాటను రిలీజ్ చేశారు. భీమ్స్ స్వరపరచిన ఈ జానపద గీతానికి దేవ్ పవార్ సాహిత్యం అందించారు. స్వాతి రెడ్డి ఆలపించిన ఈ పాటకు శేఖర్ మాస్టర్ నృత్య రీతులు సమకూర్చారు. రవితేజ, ఆషికా, డింపుల్ వేసిన స్టెప్పులు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు కిశోర్ తిరుమల మాట్లాడుతూ, ఇది ఆద్యంతం వినోదాత్మక కుటుంబ కథా చిత్రమని, అందరూ థియేటర్లకు వచ్చి ఆస్వాదించాలని కోరారు. డింపుల్ హయాతి చాలా రోజుల తర్వాత ఇలాంటి మాస్ పాట చేశానని, ఇది ప్రత్యేకమైనదని అన్నారు. ఆషికా రంగనాథ్ ఈ పాట థియేటర్లో అలరిస్తుందని, తాము చాలా కష్టపడి డ్యాన్స్ చేశామని తెలిపారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ ని షేక్ చేసేస్తుంది. ఈ పాటతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *