AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషన్‌కు నూతన కమిషనర్లను నియమిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఈ నియామకాలపై ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఐదుగురు సభ్యులతో కూడిన ఈ కమిషన్ ఇకపై రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం (RTI) అమలును పర్యవేక్షించనుంది.
చీఫ్ కమిషనర్‌గా బాధ్యతలు రాష్ట్ర సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్‌గా (Chief Commissioner) వజ్జా శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఆయనతో పాటు మరో నలుగురు కమిషనర్లను కూడా ప్రభుత్వం ఎంపిక చేసింది.
ఇది కూడా చదవండి: Chandrababu: తెలుగు జాతి గర్వపడేలా పాలన.. అరాచక శక్తులకు తావులేదు
కొత్త కమిషనర్లు వీరే..
- వట్టికూటి శరత్‌చంద్ర కల్యాణ చక్రవర్తి
- గాజుల ఆదెన్న
- ఒంటేరు రవిబాబు
- పరవాడ సింహాచలం నాయుడు
పదవీ కాలం ఈ కొత్త కమిషనర్లు అందరూ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి మూడేళ్ల పాటు ఈ పదవుల్లో కొనసాగుతారు. ప్రజలకు ప్రభుత్వ సమాచారం త్వరగా అందేలా చూడటం, ఆర్టీఐ దరఖాస్తుల పరిష్కారంలో కీలక పాత్ర పోషించడం వీరి ప్రధాన బాధ్యత. ఈ నియామకాలతో సమాచార కమిషన్‌లో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారం వేగవంతం అయ్యే అవకాశం ఉంది.
