Vadodara Bridge Collapse: గుజరాత్ రాష్ట్రంలోని వడోదర జిల్లా పరిధిలో మూడు రోజుల క్రితం వంతెన కూలిన శనివారం (జూలై 11) నాటికి మృతుల సంఖ్య 20కి చేరుకున్నది. ఇప్పటికీ అధికారులు సహాయక చర్యలు చేపడుతూనే ఉన్నారు. మహిసాగర్ నదిపై ఉన్న గంభీర వంతెన కూలిన ఘటనలో రెండు భారీ లారీలు సహా నాలుగు వ్యాన్లు, ఒక బైక్ సహా నదిలో పడిపోయినట్టు ప్రత్యక్ష సాక్షలు చెప్పారు. నదిలో గల్లంతైన వారిలో ఇప్పటి వరకు 20 మంది వరకు చనిపోయినట్టు నిర్ధారించారు. గల్లంతైన వారి కోసం ఇంకా గాలింపు చర్యలు చేపడుతున్నారు.
Vadodara Bridge Collapse: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో ఈ ఘటన జరిగింది. 40 ఏళ్ల పురాతనమైన ఈ బ్రిడ్జి మధ్యన రెండు పిల్లర్ల నడుమ స్లాబు కుప్పకూలడంతో వాహనాలు నదిలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. అక్కడ వర్షాల కారణంగా రెస్క్యూ బృందాల సహాయక చర్యలకు కొంత ఆటంకం ఏర్పడుతున్నా, మధ్య మధ్యలో కొనసాగిస్తున్నారు. ఇంకా సహాయక చర్యలను చేపడుతున్నట్టు వడోదర జిల్లా కలెక్టర్ అనిల్ ధమేలియా తెలిపారు.