Uttarakhand: ఉత్తరాఖండ్‌లో భారీ వరదలతో తీవ్రనష్టం వాటిల్లింది. ఆ రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 11 మంది జవాన్లు గల్లంతయ్యారని ఆర్మీ అధికారులు తెలిపారు. ఉత్తర కాశీ జిల్లాలో వచ్చిన వరదల్లో హార్సిల్ ఆర్మీ బేస్ క్యాంపు మొత్తం వరదల్లో కొట్టుకుపోయింది. ఈ సమయంలోనే అక్కడ ఉన్న 11 మంది గల్లంతయ్యారు. గల్లంతైన ఆర్మీ జవాన్ల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆంకా వారి ఆచూకీ దొరకలేదు.
Uttarakhand: ఉత్తరాఖండ్ భారీ వరదల కారణంగా కొండచరియలు విరిగిపడినపపుడే ధరాలి గ్రామమంతా తుడిచిపెట్టుకు పోయింది. ఈ కారణంగా పలువురు చనిపోగా 50 మంది వరకు గల్లంతయ్యారు. ఉత్తర కాశీ జిల్లాలో ఖీర్ గంగా నది ఉదృతంగా ప్రవహిస్తున్నది. వరదలతో సమీప గ్రామాలు అల్లకల్లోలంగా మారాయి.
