Uttarakhand: భారత్ లోని 78 గ్రామాల్లో చైనా సిగ్నల్స్

Uttarakhand: ఉత్తరాఖండ్‌లోని పిథౌరాగఢ్ జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో మొబైల్ సిగ్నల్ సమస్యలు తీవ్రంగా కనిపిస్తున్నాయి. భారత్-నేపాల్ సరిహద్దుకు సమీపంగా ఉన్న ఈ గ్రామాల్లో భారతీయ టెలికాం సేవల బదులు నేపాల్ టెలికాం సిగ్నల్‌లు అందుతున్నాయి. ఈ సమస్య కారణంగా ప్రభుత్వ సేవలు, ఆన్‌లైన్ కార్యకలాపాలు, మరియు కమ్యూనికేషన్‌లో గ్రామస్తులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పిథౌరాగఢ్ జిల్లాలో మొత్తం 78 సరిహద్దు గ్రామాలు ఈ సమస్యతో బాధపడుతున్నాయి. జిల్లా హెడ్‌క్వార్టర్స్‌కు 18-20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామాల్లో భారత టెలికాం టవర్లు తక్కువగా ఉండటం ప్రధాన కారణం. దాంతో నేపాల్ టవర్ల నుంచి వచ్చే నెట్‌వర్క్ ఆటోమేటిక్‌గా ఫోన్లకు చేరుతుంది. ఈ విదేశీ నెట్‌వర్క్ ఆధారపడటం వల్ల కాల్ రేట్లు పెరగడమే కాకుండా సెక్యూరిటీ సంబంధిత ఆందోళనలు కూడా పెరుగుతున్నాయి.

సిగ్నల్ సమస్య వల్ల ఆన్‌లైన్ విద్యపై కూడా ప్రభావం పడుతోంది. ప్రభుత్వ పథకాల కోసం ఫోన్ ఆధారిత సేవలు, ముఖ్యంగా LPG గ్యాస్ బుకింగ్, బెడదగా మారాయి. వీడియో కాల్స్, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ వంటి అవసరాల కోసం గ్రామస్తులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని జిల్లా కలెక్టర్ ఆశిష్ చౌహాన్ స్పందించారు. సరిహద్దు గ్రామాల్లో సిగ్నల్ సమస్య పరిష్కారానికి భారత మొబైల్ కంపెనీలతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. త్వరలో మెరుగైన నెట్‌వర్క్ సదుపాయం అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *